ఫ్లనాట్ నియస్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అదనపు కలెక్టర్ కిరణ్మయి
రంగారెడ్డి,ఆగస్టు5 ( విజయక్రాంతి) వచ్చే సెప్టెంబర్2026లో నిర్వహించనున్న ఫ్లనాట్ నియస్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ పరీక్షను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డా. కిరణ్మయి అధికారులను ఆదేశించారు.బుధవారం ఐడీఓసి కలెక్టరేట్లో నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో ఆమె అధికారులతో కలిసి పరీక్షల ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.
జిల్లాలోని ‘ఉల్లాస్’ అభ్యాసకులందరూ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులు అయ్యేలా లెర్నింగ్ సెంటర్లలో క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అభ్యాసకుల నమోదు, హాజరు, రవాణా సౌకర్యాలు, పరీక్షా కేంద్రాల నిర్వహణపై శాఖల వారీగా స్పష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి.గ్రామ, వార్డు స్థాయిల్లో ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వామ్యమైన శాఖలన్నీ కలిసికట్టుగా పనిచేసి రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలపాలని పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ వెంకట నారాయణ, జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.






