24 June, 2026 | 2:11 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక భావన పెంపొందుతుంది

30-04-2026 12:44 AM

మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 29: దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మికత భావన పెంపొందడంతోపాటు ఐక్యత భావం అభివృద్ధి చెందుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 41వ డివిజన్ పద్మావతి కాలనీలోని పార్కులో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి వేదమంత్రోచరణతో శంకుస్థాపన చేశారు.

అనంతరం అయన మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం ఆ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక భావాలను మరింత బలపరుస్తుందని తెలిపారు. సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో ఇలాంటి ధార్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, శ్రీనివాస్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ కార్పొరేటర్ కేసాని కవిత వేణుగోపాల్ రెడ్డి అబ్బాగోని కవిత తదితరులు పాల్గొన్నారు.