17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బొగ్గు ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి

30-05-2025 02:56 AM

కోల్ ఇండియా, సింగరేణి అధికారులతో సమీక్షలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించాలని, ఇందుకోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలి, పని సంస్కృతి మెరుగుపర్చాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ నుంచి బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్‌దేవ్‌దత్‌తో కలిసి కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

బొగ్గు ఉత్పత్తి ఖర్చు తగ్గించేందుకు సింగరేణి అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. వినియోగదారులు సింగరేణికి దూరం కాకుండా ఉండాలంటే నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. సమీక్షలో సింగరేణి సీఎండీ బలరామ్, డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణరావు, వెంకటేశ్వర్లు, ఈడీ సుభానీ తదితరులు పాల్గొన్నారు.