calender_icon.png 12 July, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపితోనే దేశాభివృద్ధి

21-06-2025 05:59:36 PM

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్

మందమర్రి (విజయక్రాంతి): బిజెపి హయాంలోనే భారతదేశం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించిందని మోడీజీ 11 ఏళ్ల పాలన సుపరిపాలన ఆని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్(BJP District General Secretary Durgam Ashok) అన్నారు. జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శనివారం బిజెపి మండల అధ్యక్షులు దూట రాజ్ కుమార్ అధ్యక్షతన నిర్వ హించిన సంకల్పసభలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తన 11 సంవత్సరాల పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించేలా దేశ దశ దిశను మార్చారని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి నిరుపేదలకు నేటికీ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నాడని గుర్తు చేశారు.

గ్రామాల అభివృద్ధి తోనే దేశ అభివృద్ధి సాధ్యమని గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం తోపాటు పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు పోతున్నారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తో భారతదేశ సత్తా ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తులో బిజెపి దే అంటూ అధికారం అని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా బిజెపిని బలోపేతం చేసి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి కాషాయ జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి పురుషోత్తం, నాయకులు రాజు, వెంకటేష్,  భీంరాజు, సాయి, మొగిలి, చందు, గ్రామస్థులు పాల్గొన్నారు.