calender_icon.png 15 July, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

21-06-2025 06:01:53 PM

మున్సిపల్ కమిషనర్ భుజంగరావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ భుజంగరావు(Municipal Commissioner Bhujanga Rao) అన్నారు .శనివారం జిల్లా కేంద్రంలోని 11వ వార్డు సందీప్ నగర్ లో లబ్ధిదారుడు చిలుకూరు సంతోష్ కు మంజూరైన ఇందిరమ్మ  ఇంటికి భూమి పూజ, ముగ్గు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు తప్పకుండా మంజూరు అవుతాయని తెలిపారు. విడతల వారీగా ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని మొదటి విడతలో మంజూరు కాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అసద్, రాపర్తి కార్తిక్, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.