calender_icon.png 21 July, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్లముందే కట్ట కనుమరుగు!

21-07-2025 01:12:35 AM

  1. చెరువులకు గండి కొడుతున్న రియల్టర్లు

భూములకు డిమాండ్ పెరగడంతో అక్రమార్కుల కన్ను

నీరు నిలవని తీగల కుంట

పట్టించుకోనిఅధికారులు

మహబూబ్ నగర్ జూలై 20 (విజయ క్రాంతి) : ఎంతో గొప్ప లక్ష్యంతో నాడు చెరువులు, కుంటలను ఆవిష్కృతం చేశారు. భూ గర్భ జలాలు పుష్కలంగా ఉండాలంటే చెరువులు, కుంటలలో నీరు నిల్వ ఉంచుతూ పశువులకు తాగునీరుతో పాటు గ్రామాలలోని వివిధ బోర్లు కూడా రీఛార్జ్ అవుతూ మనిషి మనుగడకు చెరువులో కుంటలు తో డ్పాటును అందిస్తూ వస్తున్నాయి. ఈ దశలోనే ప్రభుత్వాలు కూడా వివిధ ప్రాజె క్టులను ఏర్పాటు చేస్తూ నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటేనే మనిషి మనుగడ ఆరోగ్యకరంగా ఉంటుందని ఆలోచనతో అ త్యధిక టీఎంసీల నీరు ఉండేలా ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరుగుతుంది. 

కాగా కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువు భూములే కదా అడిగేది ఎవరో అనుకుంటున్నారో ఏమో కొందరు రియల్ వ్యాపారులు కూడా చెరువుల భూములపై కన్నువేస్తున్నారు.  పత్రికల్లో చెరువుల భూములు కబ్జా అంటూ కథనాలు వస్తేనే అధికారులు అటువైపు తిరిగి చూసి ఫిర్యాదులు చేస్తూ కొంత మేరకు నిలుపుదల చేసుకుంటూ వస్తున్నా రు. ఇప్పటికే ఎన్నో చెరువులు కనుమరుగాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉండడంతో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో చెరువు లు, కుంటల భూములలో రియల్ వ్యాపారానికి బీజం పడుతుంది. 

కరుగుతున్న తీగల కుంట కట్ట...

భూత్పూర్ నుంచి చించోలి వరకు నిర్మిస్తున్న ఎన్ హెచ్ 167 రోడ్డు శరవేగంగా గత రెండు ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్ హెచ్ 44 సమీపంలోని అమిస్తా పూర్ ప్రధాన రోడ్డు కు అతి సమీపంలో ఉన్న తీగల కుంట కట్ట రోజురోజుకు రోడ్డు భాగానికి సంబంధిత అధికారులు లా క్కుంటున్నారు. ఇప్పటికే కట్ట భూభాగాన్ని కొంతమేరకు తీసుకొని డ్రైనేజీ నిర్మాణం తో పాటు రోడ్డు కూడా వేయడం జరిగింది.

దీని కి తోడు గతంలోనే ఈ చెరువులో నీరు నిల్వ ఉండకుండా నిరంతరం నీరు పోయేలా చెరువును నిర్వీర్యం చేసేలా కొందరు చెరువు భూములపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లు ఉన్నప్పటికీ మునుముందు చెరువును లేకుండా చేసేలా కుట్రలు కూడా జరుగుతున్నాయని ఆ ప్రాం తవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రత్యేక పర్యవేక్షణ చేసి తీగలకుంట చెరువును యధావిధిగా ఉండే లా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

పర్యవేక్షణ అవసరం..

ఇప్పటికే భూముల విలువ రెట్టింపు కావడంతో ఎక్కడ చూసినా వెంచర్లు కొలువు తీరుతున్నాయి. ప్రభుత్వ భూముల పైనే రియల్ వ్యాపారులు కన్ను వేసి ఎలాగైనా ఆ భూములపై మంచి రోడ్లు వేసి రియల్ వ్యా పారాన్ని సృష్టించి గజాల లెక్కల విక్రయిస్తే కోట్లాది రూపాయలు పోగు చేసుకోవచ్చు అనే కుట్రలు కూడా లేకపోలేదు. అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపో తే రియల్ వ్యాపారులు మాత్రం ఇదే పని చేసేందుకు ఎంతో ముందు చూపుతో అడుగులు వేస్తున్నారు. చెరువులు కుంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణ అభిమానులు, ప్రజలు కోరుతున్నారు. 

పక్కగా కట్టవేపిస్తాం...

చెరువు కట్టను కచ్చితంగా వేపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. చెరువు కట్ట భూభాగాన్ని కొంతమేరకు నేషనల్ హైవే వారు రోడ్డు వేసిన విషయం వాస్తవమే. కాగా చెరువు కట్టకు ఎలాంటి ఇ బ్బంది లేదు.చెరువులో నుంచి నీరు బయటకు వెళ్లకుండా నేషనల్ హైవే అధికారుల సహకారంతో సంబంధిత కాంట్రాక్టర్ చేత చెరువు కట్టను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ విషయంపై నేషనల్ హైవే అధికారులతో మాట్లాడటం జరిగింది. యధావిధిగా చెరు వు ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

అబ్దు సిద్ధికి, డిఈ, నీటిపారుదల శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా