13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పాత పీఆర్సీ ఫిక్సేషన్ గడువు సెప్టెంబర్ 30

27-03-2026 01:43 AM

పలు కారణాల వల్ల పీఆర్సీ చేసుకోని వారికి అవకాశం

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాం తి): తెలంగాణ మొదటి పీఆర్సీ(పీఆర్సీ 2020) స్కేల్స్‌లో వివిధ కారణాలతో చేసుకోని వారికి పే ఫిక్సేషన్ చేసుకునేందుకు వీలుగా సర్కారు గడువు పొడిగించింది. గతం లో ప్రతి ఉద్యోగి ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అనుమతిలేకుండా ఫిక్సేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా  గురువా రం ఉత్తర్వులు జారీ చేశారు.

కొన్ని కారణాల వల్ల గత పీఆర్సీని చేసుకోని వారికి మాత్రమే దీంతో ప్రయోజనం కలగనుంది. మెడికల్ సమస్య, విదేశాలకు వెళ్లిన వారు, సస్పెండ్, అబ్‌స్కాండ్ అయి ఫిక్సేషన్ చేసుకోని వారికి మాత్రమే ఇది వర్తించనుంది. ఇది 2020 నాటి మొదటి పీఆర్సీ. ఇంకా రెండో పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయలేదు. దీన్ని 1 జూలై 2023 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. పీఆర్సీ అమలుకు ఇప్పటికే ప్రభుత్వం కమి టీని వేయగా, నివేదికను సైతం సిద్ధం చేసిం ది. ఈ కమిటీ గడువు ఈనెల 31తో ముగియనుంది. గడువు పెంచే అవకాశముంది.