విజేతలకు బహుమతులు అందజేసిన టౌన్ ఏసీపీ
24-06-2026 01:09 AM
ఖమ్మం టౌన్, జూన్ 23 (విజయ క్రాంతి): డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఖమ్మం టౌన్ ఏసీపీ బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ యువత మాదక దవ్యాలకు అలవాటు పడి ఆరోగ్యంతో పాటు జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






