05-01-2026 12:12:19 AM
పయనీర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
ఎల్బీనగర్, జనవరి 4 : ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా నివారించ వచ్చని పయనీర్ ఆస్పత్రి ఎండీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో పయనీర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, డెంటల్ చెక్ ఆఫ్, కంటి పరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పయనీర్ ఆస్పత్రి ఎండీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హెల్త్ క్యాంపులో సుమారు 300మందికి వైద్య పరీక్షలు చేశామన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, డెంటిస్ట్, ఆప్తామలజిస్ట్, పల్మనాలజిస్ట్ వైద్యులు సేవలు అందించినట్లు తెలిపారు.
పయనీర్ ఆస్పత్రిలో న్యూరో, గ్యాస్ట్రో, ఫల్మానాలజీ, పిడియాట్రిక్, క్రిటికల్ కేర్, ల్యాపరోస్కోపి, ఆర్థోపెడిక్ సేవలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాయనీయర్ హాస్పిటల్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, జీఎం రవీందర్ రెడ్డి, ముత్యాలు గౌడ్, శ్రీనివాస్, ప్రకాశ్, ఎన్జీవోస్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.