calender_icon.png 8 January, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదేళ్లు కలిసి పనిచేసుకుందాం..

05-01-2026 12:10:12 AM

గ్రామ కమిటీ సమావేశం 

గోపాలపేట జనవరి 4: ఈ ఐదేళ్లు అందరం కలిసి పనిచేసే గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామ సర్పంచ్ పేరి లోకా రెడ్డి అన్నారు.  గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొదటి గ్రామ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ పేరు లోకా రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఉపసర్పంచ్ దేశి రామచంద్రయ్య వార్డు సభ్యులతో కార్యదర్శి సాయికుమార్ గ్రామ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. ఉప సర్పంచ్  వార్డు సభ్యులు చైతన్యంగా ఉండాలన్నారు. ఏ వార్డు సభ్యుడు  తన కాలనీలో పలాని సమస్య ఉందని తమ దృష్టికి తేవాలని సర్పంచ్ సూచించారు.

మొదటగా సిబ్బంది అంతా అన్ని కాలనీలోని పర్యటించాలన్నారు. ముఖ్యంగా తాగునీరు వీధిలైట్లు మురుగు కాలువలను పరిశీలించాలని తెలిపారు. ఏ సమస్య ఉన్న అందరం కలిసి సమస్యను తీర్చేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సాయికుమార్ ఉపసర్పంచ్ దేశి రామచంద్రయ్య వార్డు సభ్యులు గంధం వంశీకృష్ణ చుక్క మధుబాబు ముచ్చూమారి లక్ష్మి, గౌను కాడి లక్ష్మి, బోధని ప్రీతి, బండపల్లి కురుమూర్తి, చింతల రేణుక, ముచ్చుమారి సంజీవ్, బండపల్లి మల్లేష్, కందూరి సుజాత పాల్గొన్నారు.