13 July, 2026 | 1:50 AM

ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ వేగవంతం చేయాలి

13-07-2026 12:00 AM

కలెక్టర్ మను చౌదరి 

కూకట్‌పల్లి, జులై 12 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బి ఎల్ ఓ లు నిర్వహిస్తున్న ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ వేగవంతం చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మన చౌదరి బిఎల్‌ఓ లను ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆదివారం జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్యునరేషన్ వారాలను ఇవ్వడంలోనూ పూర్తిచేసిన ఫారాలను  తిరిగి సేకరించడంలోని బిఎల్‌ఓ లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఎమ్యునరేషన్  ఫారాలను పూరించడంలో ఓటర్ల సందేహాలను నివృత్తి పరుస్తూ వారికి సహకరించాలన్నారు. సార్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే సేకరించిన ఎమ్యునరేషన్ ఫారాలను వెంట వెంటనే డిజిటలైజేషన్ చేయాలని బి ఎల్ వో లను ఆదేశించారు. అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సంబంధిత సూపర్వైజర్లకు అందించాలని బిఎల్‌ఓ లకు సూచించారు. ఈ సందర్భంగా కూకట్ పల్లి  డివిజన్ లోని 371,372,373,374 పోలింగ్ స్టేషన్లలో నిర్వహిస్తున్న ఎమ్యూనరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లతో నేరుగా మాట్లాడి ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో  భాగంగా ఎమ్యూనరేషన్ పారాలను పూర్తి చేయడం పై అవగాహన కల్పించారు.