12-07-2025 12:00:00 AM
విద్యాశాఖపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూలై -11( విజయ క్రాంతి ):ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంచడమే అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పని చేయాలని, జూలై 15 నాటికి ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పం పిణీ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పా ఠ్య పుస్తకాల పంపిణీ, ఎఫ్.ఆర్.ఎస్. అమలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభివృద్ధి పనులు, ఎఫ్.ఎల్.ఎన్. పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుం దని, మౌళిక సదుపాయాల కల్పన, హెచ్‌ఆర్ పై పెట్టే ఖర్చుకు తగిన ఫలితం సాధించేలా పని చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలకు మంచి విద్యా ప్రమాణాలు అందాలని అన్నా రు.జూలై 15 నాటికి ప్రతి విద్యార్థికి రెండవ జత దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేసి వి వరాలు అప్ డేట్ చేయాలని అన్నారు.
రాబోయే మూడు నెలల పాటు యుద్ద ప్రాతిపదికన 3వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పదాలు చదవడం స్కిల్ పెంచడంపై శ్రద్ద పెట్టాలని అ న్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. సత్యనారాయణ , సీఎంఓ రాజశేఖర్, ఈఈ ఆర్ అండ్ బీ ఎం. పవార్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.