calender_icon.png 12 July, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాల నిర్వహించకుండా అడ్మిషన్ తీసుకుంటున్న వికాస్ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

12-07-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, జులై 11, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో కళాశాల నిర్వహించకుండానే అడ్మిషన్లను స్వీకరిస్తున్న వికాస్ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రామ్ చరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల వద్ద డిఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కళాశాలకు కనీసం బోర్డు లేకుండా ఒకళ్ళు, ఇద్దరు ఉపాధ్యాయులతో కళాశాల నడుపుతూ విద్యార్థుల వద్ద నుండి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారనీ ఆయన ఆరోపించారు. క్లాసులు నిర్వహించకుండా విద్యార్థులను అడ్మిషన్ చేసుకుని హాల్ టికెట్లు సమయంలో ఫీజు కడితేనే ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారన్నారు.

డబ్బుల కోసం విద్యార్థి జీవితాలతో చెలగాట మాడుతున్నారనీ. ఇలా క్లాసులు నిర్వహించకుండా నిబంధనలను అతిక్రమిస్తూ నిర్వహిస్తున్న వికాస్ డిగ్రి కళాశాల గుర్తింపులు రద్దు చేసి యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సాగర్, స్థానిక నాయకులు సన్నీ పాల్గొన్నారు.