16 March, 2026 | 4:56 AM

కేటీఆర్‌తోనే డ్రగ్స్ కల్చర్ అధికం

16-03-2026 12:52 AM
  1. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ 
  2. బీఆర్‌ఎస్ నాయకులు డ్రగ్స్ జల్సాలు
  3. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి 
  4. కేటీఆర్, ప్లుటై రోహిత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

హైదరాబాద్, మార్చి15 (విజయక్రాంతి): కేటీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ అధికమైందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. మోయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఉండటంతో.. కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రానికి మచ్చలా మారిందని దుయ్యబట్టారు.

బీఆర్‌ఎస్ నాయకులకు వ్యతిరేకంగా గాంధీభవన్ ఎదు ట యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో ఆదివారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ కేటీఆర్‌తోనే తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిందని, పైలెట్ రోహిత్‌రెడ్డితో మరోసారి బయటపడిందన్నారు.

కేటీ ఆర్ డ్రగ్స్ టెస్ట్ చాలెంజ్ విసిరారు, కానీ ఈగల్ టీమ్‌కు బీఆర్‌ఎస్ నాయకులు డ్రగ్స్ తో పట్టుబడ్డార న్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏం సమాధానం చెబుతారో స్పష్టం చేయాలన్నారు. ఇకనైనా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో తప్పును ఒప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహి త రాష్ట్రంగా తీర్చి దిద్దుతోందని, కానీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారని విమర్శించారు.

జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరగడానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్ నాయకులేనని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సింది పోయి మత్తులో మునుగుతూ జల్సాలకు తేర లేపడంతో రాష్ట్ర ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి రా ష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం గా పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్యాం శరణ్‌రెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు. 

రోహిత్‌రెడ్డి డ్రగ్స్‌పై బీఆర్‌ఎస్ స్పందించాలి : ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లుగా దొరికారని, దీనికి ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ మనోహర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చిందని ఆగ్రహించారు. డ్రగ్స్ విషయంలో పదేళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహారించిందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చడం కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని మనోహర్‌రెడ్డి తెలిపారు. పైలెట్ రోహిత్‌రెడ్డి వేరే రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ హంగామా చేశారన్నారు. డ్రగ్స్ రాకెట్‌లో ఉన్న వాళ్ల పేర్లు బయటకు వస్తాయని, కూకటివేళ్లతో డ్రగ్స్ మాఫియాను ప్రభుత్వం నిర్మూలిస్తోందన్నారు.