calender_icon.png 18 September, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన వేద ఘోష చతుర్వేద పారాయణం

18-09-2025 01:38:34 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 17 : నాగోల్ డివిజన్ లోని జైపూర్ కాలనీ పరిధిలో శివపురి కాలనీలో ఉన్న శ్రీశైవ మహాపీఠంలో మూ డు రోజుల పాటు నిర్వహించిన వేద ఘోష చతుర్వేద పారాయణం బుధవారం భక్తిశ్రద్ధలతో ముగిసింది. శ్రీశైవ మహా పీఠాధిపతి డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మ, ఉప పీఠాధిపతి మల్లంపల్లి దుర్గా మల్లికార్జున ప్రసాద్ ఆశీర్వచనంతో ఆస్థాన పండితుడు ఆచార్య డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ, పాలక సమితి ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ వాస్తు పండితులు ముదిగొండ వీరభ ద్ర మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఉపాధ్యా య కాశీపతి సోమయాజులు పర్యవేక్షణలో వేద ఘోష చతుర్వేద పారాయణం వేడుకలు జరిగాయి.

ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఆదేశానుసారం టీటీడీకి చెందిన 46 మంది వేద పండితులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలోని 82 పన్నాలను నిత్యం ఐదు గంటల చొప్పున మూడు రోజు ల పాటు పఠించారు. వేద పండితులను నిర్మల గౌతమశ్రమ వ్యవస్థాపకుడు శతధిక శివలింగ సంస్థపాకులు  నిర్మల రాజావీరేశ్వర శర్మ(కాళేశ్వరం) వేదపండితులకు శాలువాలతో సత్కరించారు.