calender_icon.png 18 September, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ తగ్గించిన కేంద్రానికి ధన్యవాదాలు

18-09-2025 01:37:23 AM

‘భారతి సిమెంట్’ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సిమెంట్‌పై కేంద్రం జీఎస్టీ తగ్గించినందుకు వికాట్ ఫ్రాన్స్ అనుబంధ సంస్థ అయిన భారతి సిమెంట్ ధన్యవాదాలు తెలిపింది. సిమెంట్‌పై ప్రస్తుతమున్న 28% జీఎస్టీని 18%కి తగ్గించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారతి సిమెంట్ కార్పొరేషన్ (ప్రై) లిమిటెడ్ డైరెక్టర్, -మార్కెటింగ్ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి అమలుకానున్న ఈ కొత్త జీఎస్టీ విధానానికి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం, భారతదేశంలోని లక్షలాది మంది గృహనిర్మాణదారులు, మౌలిక సదుపాయాల డెవలపర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపు వినియోగదారులకు ప్రయోజనం అందజేస్తామన్నారు.