17 March, 2026 | 3:17 AM

మజ్లిస్ పార్టీ తీరును యావత్ సమాజం గమనిస్తోంది

17-03-2026 02:07 AM
  1. జాతీయ గేయమైన వందేమాతరంపై ప్రదర్శించిన తీరు హేయమైన చర్య 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం 

హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి) : జాతీయ గేయం ‘వందేమాతరం ’ పట్ల మజ్లిస్ పార్టీ ప్రదర్శించిన ఆగౌరవాన్ని యావత్ సమాజం గమనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో వందేమాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా సభ నుంచి వాకౌట్ చేయ డం అత్యంత హేయమైన చర్య సోమవారం ఆయన ఎక్స్ వేదిగా మండిపడ్డారు.

అసలు వీరి విధేయత ఎవరి పట్ల ఉంది..? సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా వీరి నాయకుడు ‘జై పా లస్తీనా ’ అని అని నినాదాలు చేసిన తీరును దేశ ప్రజల ఎలా విస్మరించగలరు..? ఇలాం టి చర్యలు దేశం పట్ల వారికి ఉన్న గౌరవంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. జాతీయ ప్రతీకలను అవమానించడాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికి హర్షించదన్నారు.