1 May, 2026 | 5:50 PM

యూరియా వైఫల్యం కేంద్రానిదే!

02-09-2025 12:00 AM

తెలంగాణ రాష్ర్టంపై మోదీ సవతి తల్లి ప్రేమ గత 12 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా, తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నలకు సమయా నికి ఎరువులు అందకుండా కుట్ర చేస్తుం ది. మన రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన యూరియా కోటాను సరఫరా చేయకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుం ది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి.

కేం ద్ర ప్రభుత్వం, ఈ వానకాలం పంట కొర కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రి క్ టన్నుల యూరియా కేటాయించింది. ఈ కేటాయింపుల నుంచి ఆగస్టు నెల ముగిసేలోగా 8.30 లక్షల టన్నుల యూరి యా సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 5.30 లక్షల టన్ను లు మాత్రమే. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే తెలంగాణ రైతాంగం పక్షాన యూరియా కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో ఉంది.

పార్లమెం టు లోపల, బయట కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు యూరియా కోసం డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రి యాంక గాంధీ సైతం తెలంగాణ రైతులపై మోదీ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడు తూ పార్లమెంటు బయట ధర్నా చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రా తినిధ్యం వహిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి కేటాయించిన మేరకు యూరియా తేవడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 

బాధ్యతలు మరిచి..

యూరియాను ఉత్పత్తి చేసి సొసైటీలకు చేరవేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఆ బాధ్యతను మరిచిన కేంద్రం సహా రాష్ర్ట బీజేపీ నాయకత్వం.. తెలంగాణ రైతన్నలకు హక్కుగా దక్కాల్సిన యూరియా కోటా సరఫరా చేయకుండా కావాలని అడ్డుకుం టూ కొరతను సృష్టిస్తున్నారు. రైతుల సం క్షేమమే పరమాధిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ.. బీఆర్‌ఎస్‌తో కలిసి కుట్రలు రచిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ 20 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడంతో పాటు తొమ్మిది వేల కోట్ల రూపాయలు.. రైతుల ఖాతాలో ‘రైతు భరో సా’ పథకం కింద జమచేసి  రైతంగాన్ని సంతోషంలో ముంచెత్తింది.

ప్రజల మద్దతుతో బలంగా కనిపిస్తున్న రేవంత్ సర్కార్ ను రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎదుర్కొనే శక్తి లేని బీజేపీ.. యూరియా కొరత పేరు తో  దొంగదెబ్బకొట్టాలని చూస్తోంది. ఇక యూరియా సరఫరా చేసే రామగుండం యూరియా ఉత్పత్తి ప్లాంట్ (ఆర్‌ఎఫ్‌సీఎల్).. ఈ సీజన్‌లో సాంకేతిక సమస్యల పేరుతో మొదట 20 రోజులు.. మళ్లీ ఇప్పు డు రెండుసార్లు అదే పేరు చెప్పి ఉత్పత్తి ఆపేయడం వెనుక కేంద్రం హస్తం ఉందేమోనన్న  అనుమానం కలుగుతోంది. మరోవైపు కేసీఆర్ పాలనలో అనేకసార్లు రైతులు యూరియా కోసం ఆందోళన చేసిన సంఘటలు మరిచిన ఆ పార్టీ నేతలు రైతులతో రాజకీయం చేసే స్థాయికి దిగజారడం శోచనీయం.

బయటపడుతున్న డొల్లతనం

యూరియా సరఫరా జాప్యంపై బీజేపీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతూ తమ పార్టీలోని డొల్లతనాన్ని బయటపెట్టి పరువు తీసుకుంటున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. యూరియా సరఫరాలో ఇబ్బంది ఉందని, యుద్ధాల నేపథ్యంలో, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఆలస్యమైనందుకు యూరి యా తెలంగాణకు సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు. మరో ఎంపీ ఈటెల రాజేందర్.. అసలు యూరియా దిగుమతి చేసుకోవడం ఎప్పుడో మానేశామంటున్నారు.

రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు రాంచంద ర్‌రావు ఒక అడుగు ముందుకేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయలేకపోతున్నామనే వాస్తవాన్ని అంగీకరించ కుండా.. రాష్ర్ట ప్రభుత్వం యూరియా పం పిణీ సరిగ్గా చేయడం లేదని పేర్కొనడం సిగ్గుచేటు. అయితే రైతన్నలకు యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేపట్టవలసిన చర్యలపై రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. యూరియా కొరత ఉన్నప్పటికీ పంపిణీలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రా ష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తూ వస్తుంది.

ప్రత్యమ్నాయ మార్గాలు..

మొక్క ఎదుగుదలకు యూరియా అ త్యంత కీలకం. అందుకే రైతన్నలు ఈ సమయంలో యూరియాను అధికంగా విని యోగిస్తున్నారు. తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మూడు పంటలు సాగు లో విత్తనం మొలకెత్తిన 25 నుంచి 30 రోజుల్లోపు యూరియా మొదటి డోస్ అందించాలి. తద్వారా పంట పచ్చగా, బ లంగా ఉండటంతో పాటు కిరణజన్య సం యోగక్రియం జరిగి పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. 

యూరి యా కొరతతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లడం ఉత్తమం. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరి యా రసాయనం అందుబాటులో ఉంది. యూరియా అందని రైతులు నానో-యూరి యా రసాయనాన్ని వినియోగించవచ్చు. సాధారణ యూరియా ఎంత సమర్థవంతంగా పంట పెరుగుదలకు దోదప డు తుందో.. నానో యూరియా కూడా అంతే ధీటుగా పనిచేస్తుంది. 250 మిల్లీలీటర్ల నా నో యూరియా రసాయన బాటి ల్.. 45 కిలోల యూరియా బస్తాకు సమానమైన ఫలితాన్ని ఇస్తుంది.

ధర కూడా కేవలం రూ.250 లోపే ఉంటుంది. అయితే ఇప్పటికీ రైతుల్లో నానో యూరియా పట్ల కొన్ని అపోహలు ఉన్నాయి. ధర తక్కువే గాని, డ్రోన్ ద్వారా  స్ప్రే చేస్తే ఎకరాకి 400 ఖ ర్చు వస్తుందనే రైతులు వెను కడుగు వేస్తున్నారు. కానీ పంట వేసిన 20- నుంచి 25 రోజుల్లో చీడపురుగుల నుంచి రక్షణ కో సం రసాయనిక ఎరువులను స్ప్రే చేసే సమయంలో నానో యూరియాను కూడా కలిపి వాడుకోవచ్చు. తద్వారా రైతు సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

అధిక యూరియాతో ప్రమాదమే

యూరియా మోతాదుకు మించి వాడటం కూడా ప్రమాదమే. దీనివల్ల భూ సారానికి, పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఎకరం పొలానికి 25 నుం చి 30 కేజీల యూరియా సరిపోతుంది. పరిధిని దాటి యూరియా వినియోగిస్తే చెట్టు కింది భాగంలో యూరియా అవశేషాలతో సున్నం కట్టు లాంటి మందమైన పొర ఏర్పడి, మొక్క  వేళ్లను భూమిలోకి చొచ్చుకుపోకుండా అడ్డుపడి తద్వారా వేర్ల కు ఖనిజ లవణాలు, పోషకాలు అందకుం డా నిరోధిస్తుంది. దీంతో పంట దిగుబడి తగ్గిపోతుంది.

యూరియాకు ప్రత్యామ్నాయంగా, భూసారానికి మేలు చేసే సహజ పచ్చి రొట్టె ఎరువులను కూడా వాడుకోవచ్చు. ఎండాకాలం కోతలు అయిపోయి న వెంటనే ఉన్న తడితోనే సాగు చేసుకునే, జనుము జీలుగు బాగు చేసుకోవాలి. సాధారణంగా పచ్చి రొట్టె ఎలుగుల విత్తనాల 40 కేజీల బ్యాగు ధర 2,700 ఉండ గా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సబ్సిడీ కింద కేవలం 900 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. వరి పంట వేయడానికి 50 రోజుల ముందు పచ్చి రొట్ట ఎరువులు సాగు చేసి పంట వేయడానికి 15 రోజులు ముందు పొలంలో కలియ దున్నాలి. ఇలా చేస్తే  వేర్లు లోపలికి వెళ్లి యూరియా అవశేషాలతో తెర్పడిన సున్నపు పొరను విచ్చి నం చేసి భూమిని సారవంతంగా మారుస్తాయి.

రైతుల కోసం గత కాంగ్రెస్ ప్రభు త్వం ‘రైతు చైతన్య యాత్రలు’ కార్యక్రమా న్ని చేపట్టింది. ఆఫ్ సీజన్ కాలంలో రైతులకు సాగు పద్ధతులు, విత్తన రకాలు, ఎరు వుల వాడకం, రసాయన మందుల వినియోగం, ప్రత్యామ్నాయ పంటలు లాంటి  అంశాలపై అవగాహన కల్పించేందుకు, రై తుల సంక్షేమం కోసం నాటి కాంగ్రెస్ ప్ర భుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బీఆర్‌ఎస్ గత పదేండ్ల పాలనలో ఈ కార్యక్ర మాన్ని పూర్తిగా రద్దు చేశారు. రైతన్నల సం క్షేమమే ధ్యేయంగా పనిచేసే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. తిరిగి ‘రైతు చైతన్య యాత్ర’ పు నరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. 

వ్యాసకర్త సెల్ : 9866776999