1 May, 2026 | 11:00 PM

పరకాల నెత్తుటి చరిత్రకు 79 ఏళ్లు

02-09-2025 12:00 AM

సరిగ్గా 79ఏళ్ల క్రితం.. 1947లో యావద్దేశం స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితే తెలంగాణలో నిజాం నిరంకుశత్వం కింద ప్రజలు నలిగిపోయారు. రజాకార్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఉద్యమనేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న పరకాల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జాతీయ జెండాను ఎగురవేయాలని  నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఊరేగింపుగా చాపలబండకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన రజాకార్లు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను విచక్షణా రహితంగా నరికివేశారు.

భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం నిజాం నిరంకుశత్వంపై పోరులో పోరుగడ్డ పరకాల.. నెత్తురు చిందించి చరిత్రలో నిలిచిన రోజు. తుపాకీ గుండ్లకు ఎదురొడ్డిన ఆ రక్త చరిత్రకు నేటితో 79 ఏళ్లు. జలియన్‌వాలాబాగ్ ఘటనను తలపించే పరకాల నెత్తుటి జ్ఞాపకమే అమర ధామం. స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హనుమకొండ జిల్లా పరకాలలో జరిగిన పోరాటం చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది.

మరో జలియన్ వాలా బాగ్ పోరాటంగా చరిత్ర పుటల్లోనూ పరకాల పేరు తెచ్చుకుంది. అజ్ఞాతంలోకి వెళ్లిన నాయకుల పిలుపు మేరకు గ్రామాలలో నిజాం నిరంకుశ పాలన రజాకార్లను ఎదిరిస్తూ ప్రజలు త్రివర్ణ పతాకాలు ఎగురవే శారు. ఆ కార్యక్రమానికి 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. పరకాల కి సుమారు ఐదు కిలోమీటర్ల పొడవు ఊరేగింపు సాగింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలపాలి అంటూ నినాదాలు చేశారు. వందేమాతరం అంటూ ర్యాలీ కొనసాగింది.

అదే సమయంలో రజాకార్లు పట్టరాని కోపంతో  మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన వారిని చెట్టుకు కట్టేసి దారుణంగా చంపా రు. ఆ సమయంలో తెలంగాణ సాయు ధ పోరాట వీరులు పరకాల పక్కన ఉన్న చెన్న కేశవ స్వామి ఆలయం పక్కన ఉన్న చంద్రగిరి గుట్ట దగ్గర సాయుధ పోరాటం జరిపారు. మందుగుండు సామాగ్రి, తపంచాలతో తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకు న్నారు. అయినా రజాకార్లు వీరిని వదిలిపెట్టలేదు. వీరి శిబిరాలపై తరచూ దాడులు చేస్తూనే ఉన్నారు. చివరగా 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముం దు నిజాం ప్రభుత్వం లొంగిపోవడంతో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నా రు. ఆ మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం! నిరంకుశ నిజాం నుంచి సాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం పరకాల నెత్తుటి చరిత్ర..

అసలేం జరిగింది?

మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది పరకాల ఊచకో త ఘటన. సరిగ్గా 79ఏళ్ల క్రితం.. 1947లో యావద్దేశం స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితే తెలంగాణలో నిజాం నిరంకుశత్వం కింద ప్రజలు నలిగిపోయారు. రజాకార్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఉద్యమనేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న పరకాల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జాతీయ జెండాను ఎగురవేయాలని  నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఊరేగింపుగా చాపలబండకు చేరుకున్నారు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన రజాకార్లు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను వెంబడించి విచక్షణా రహితంగా నరికివేశారు. రజాకార్ల కాల్పు ల్లో అక్కడికక్కడే 15 మంది మృతి చెందా రు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఉద్యమకారులు ఆకుతోట మల్లయ్య, వడ్డెపల్లి వీరయ్య, రాజామహ్మద్‌లను రంగా పురంలో చెట్టుకు కట్టి ఊచకోత కోసి కాల్చి చంపేశారు. నాటి రజాకార్ల దురాఘాతానికి వందలాదిమంది చనిపోయారని ప్ర చారంలో ఉన్నా.. 96 మంది చనిపోయినట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 1947, సెప్టెంబర్ 2న జరిగిన ఈ దురాఘాతం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీ యాంశమైంది. నిజాం నిరంకుశపాలన  కూల్చివేయడానికి నాంది పలికింది.

అమరధామం నిర్మాణం..

20 ఏళ్ల క్రితం అమరుల స్మారకార్థం ఊచకోత జరిగిన ప్రాంతంలో అప్పటి బీజేపీ నేత, మాజీ మహారాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రమంత్రి హోదా లో అమరధామాన్ని నిర్మించారు.  ఏటా సెప్టెంబరు 2న అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విలేఖరులు నాటి ఘటనలో అమరులైన వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తుంది. పరకాల పట్టణంలోని తహసీల్ రోడ్డులో అమరదామం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంధి. రజకార్ల చేతిలో చంపబడిన వారి శిల్పాలు వరుస క్రమంలో అ మర్చినారు. చేతులు పిడికిలి ఎత్తి, ఒక చేతిలో కర్ర పట్టి పోరాటానికి పయనిస్తూ వున్నట్లుగా ఉంటాయి.

గుమ్మటం పైభాగాన చెట్టుకి కట్టి చంపిన దృశ్యాలు, వారి దేహం నుంచి తూటా తగిలి రక్తం కారడం, కాళ్లు తెగి పడిన ఘటన చూస్తే మన ఒళ్లు గగర్పొడిచేలా ఉంటాయి. ఆ శిల్పాలు, మట్టి మనుషుల బొమ్మలు చూస్తే నర నరాన ఆవేశం పొంగి పొర్లుతుంది. యుద్ధానికి సై అన్నట్లుగా భావన కలుగుతుంది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధూమ్ -దామ్‌లకు, ఆట పాటలకు వేదికగా నిలిచింది. కొన్ని విప్లవ సినిమాల,సీరియల్ల షూటింగులకు నిలయంగా మారింది.

అమరధామం పక్కన ఉన్న పార్క్ లో వివిధ రకాల మొక్కలు పచ్చదనం తో నిండి స్వచ్చమైన గాలిని అందిస్తూ వున్నాయి. పట్టణ వాసులు ఉదయం,సాయంత్రం వేళల్లో ఈ పార్క్ కి వచ్చి సేద తీరుతున్నారు. పరకాల మట్టి వాసన అందరిలో వీరత్వానికి సంకేతంగా నిలుస్తుంది. పరకాల ఊచకోతలో అసువులు భాసినవారు రంగాపూర్ (మొగుళ్ల పల్లి మండలం),కానిపర్తి( రేగొండ) వారిగా చరిత్ర తెలుపుతుంది. అమరవీరుల ఆశయలను కొనసాగించుకుందాం. వారి బాటలో అందరం పయనిద్దాం. వారు చేసిన గొప్ప త్యాగాలను స్మరించుకుం దాం. బావి తరాలకు వారి పోరాట పటిమను తెలుపుదాం. అమరధామంని మరింత అభివృద్ది చేయాలి. నేటి తరం విద్యార్థులు అమరధామం నెత్తుటి చరిత్ర గురించి తెలియజెప్పాల్సి అవసరముంది.

          వ్యాసకర్త సెల్: 98484 45134