calender_icon.png 28 October, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఐక్యతకు ప్రతీక బుగులోని జాతర

28-10-2025 12:00:00 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు

బుగులోని జాతర వాల్ పోస్టర్  ఆవిష్కరణ

రేగొండ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి  జాతర బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సోమవారం ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జాతర గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న కొండలపై స్వయంభుగా వెలసి రెండో తిరుపతిగా పేరుగాంచిన శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర వచ్చే నెల 4 వతేది నుండి 8 వతేది వరకు 5 రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనా లని ఎమ్మెల్యే కోరారు. జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలకు ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహ దపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఓ బిళ్ళ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.