13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అకాల వర్షం.. ఈదురుగాలులు

01-04-2026 12:00 AM

విద్యుత్ సరఫరాకు అంతరాయం

రాలిన మామిడి

కరీంనగర్/కోరుట్ల, మార్చి31(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందారు.. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్థరాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి.  ఈదురు గాలులు భారీగా వీచాయి.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గంగాధర, చొప్పదండి, రాముడు, కరీంనగర్ రూరక్, కొత్తపల్లి మండలలలోని పలు గ్రామాల్లో రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలోనే ఈదురు గాలులు ప్రారంభమై, వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి వర్షం కురవడంతో గ్రామాలన్నీ చల్లని వాతావరణంతో కప్పబడ్డాయి.ఈ అకాల వర్షంతో ఒకవైపు ఎండ తాపం తగ్గి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా పంట కోత సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వర్షం పడటం వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలు ఈదురు గాలుల దాటికి వరి మొక్కజొన్న మామిడి పంటలు మొత్తం నేలకొరిగాయి. అసలే ఈ సీజన్లో మామిడి  పంట అంతంత మాత్రమే ఉండడంతో  ఇంతలో  రాత్రి కురిచిన గాలి వాన  కారణంగా మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  అలాగే వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాళ్ల మొక్కజొన్న  తడిసి ముద్దయ్యింది  అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.