calender_icon.png 28 June, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగుంది: మనోజ్

28-06-2025 12:14:42 AM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమాపై ఆయన సోదరుడు, నటుడు మంచు మనోజ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ హైమాక్స్‌లో సినిమా చూసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. “సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చింది. చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా మరోస్థాయికి వెళ్తుంది.

ప్రభాస్ నటన అదిరిపోయింది. నాన్న యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అన్న కూడా ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదు. కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేశాయి. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా. పెట్టిన డబ్బు రెట్టింపుగా తిరిగి రావాలని కోరుకుంటున్నా” అన్నారు మనోజ్.