calender_icon.png 9 July, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుహాస్ గల్లీ స్టెప్!

28-06-2025 12:15:37 AM

సుహాస్ తాజాగా నటిస్తు న్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ ‘జో’ ఫేమ్ మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో వీఆర్ట్స్ పతాకంపై హరీశ్ నల్ల నిర్మిస్తున్నారు.

జూలై 11న రిలీజ్ కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘గల్లీ స్టెప్’ పేరుతో ఓ లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ‘ఓ మెరుపులా చిందులే వేయారా’ అంటూ సాగే ఈ పాటను కథానాయకుడు సుహాస్ ఆలపించడం విశేషం. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు రథన్ స్వరాలు సమకూర్చారు.