31-01-2026 12:00:00 AM
వనపర్తి, జనవరి 30 ( విజయక్రాంతి ) : జిల్లా కేంద్రం చిట్యాల సమీపంలో గల మార్కెట్ యార్డ్ లో శుక్రవారం వేరుశెనగ పంట దిగుబడిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ముందుగా మార్కెట్ లో ఉన్న వేరుసెనగ ధాన్యరాశులను పరిశీలించి దిగుబడి,మద్దతు ధర గురుంచి ఆయన మహిళా రైతులతో అడిగి తెలుసుకున్నారు. మ హిళా రైతులు ఈ సంవత్సరం దిగుబడి పెరిగిందని మద్దతు ధర కూడా సంతృప్తికరంగా వచ్చిందని మీ హాయంలో పుష్కలమైన సా గునీళ్ళు రావడం వల్లే సాధ్యం అయిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ట్రేడ ర్స్, కమిషన్ ఏజెంట్ల, మిల్లర్ల, హమాలీ, దడవాయి చాట కూలీల,రైతులను తమ,తమ వార్డులో ఉన్న బి.ఆర్.ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.