31-01-2026 12:00:00 AM
జహీరాబాద్, జనవరి 30 : కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం వెలివేయరాదని, వారి ని దగ్గర తీసి సరియైన చికిత్స అందించేందుకు సహాయ సహకారాలు అందించాలని ఝరాసంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్ట ర్ రమ్య అన్నారు. శుక్రవారం నాడు కుష్టి వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యా లీ నిర్వహించి కుష్టి వ్యాధిగ్రస్తులను చేరదీయాలంటూ ప్రమాణం చేయించారు. శరీ రంపై తెల్లని మచ్చలు వచ్చి స్పర్శ లేకుండా ఉంటే వాటిని కుష్టివ్యాధిగ్రస్తులుగా గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు.
గతంలో ప్రతి గ్రామంలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఉండేవారని ప్రస్తుతం కుష్టి వ్యాధి కనుమరు అవుతుందని దీనికంతటికి సరియైన చికిత్స అందించడం వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మురళీకృష్ణ, సి హెచ్ ఓ సుధాకర్, వెంకటేశం, ఆయా గ్రామాల ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.