31-01-2026 12:00:00 AM
నారాయణఖేడ్, జనవరి 30: నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచగమ్మ శివారులోని విఠలేశ్వర ఆలయ ఆశ్రమ సమీపంలో సాగులో ఉన్న 600 గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీస్ అధికారులు శుక్రవారం సాయంత్రం ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పంచగామా శివారులోని విఠలేశ్వరాలయ ఆశ్రమం నడిపిస్తున్న నాగన్న మహారాజు ఆలయ సమీపంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు సమాచారం మేరకు దాడులు చేయడం జరిగిందన్నారు.
కాగా ఆశ్రమంలో తనిఖీ చేయగా 15 కిలోల ఎండు గంజాయి సైతం దొరికిందని వీటితోపాటు గంజాయి విత్తనాలను సైతం స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. సంబంధిత గంజాయి మొక్కల విలువ దాదాపు 70 లక్షల మీద ఉంటుందని పేర్కొన్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.