21-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 20 : నార్కట్ పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువుగట్టు అమ్మవారి హుండీ నుండి 3,85,695 రూపాయల ఆదాయం రాగా గట్టు పైన స్వామివారి ఆలయ హుండీ నుంచి 28, 98,762 రూపాయలు ఆదాయం సమకూరింది మొత్తం 52 రోజుల ఆదాయం కలిపి 32 లక్షల 847 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహన్ బాబు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి, నందిగామ శ్రీ దుర్గా శివ సాయి సేవా సమితి సభ్యులు, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు నల్లగొండ బ్రాంచ్ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.