15 April, 2026 | 1:37 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

12-05-2025 01:20 AM

మందమర్రి, మే 11 : ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కోరారు. పట్టణంలోని సిఈఆర్  క్లబ్ లో ఆదివారం నిర్వహించి న యూనియన్ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించడానికి 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ గా కుదించి కార్మిక కర్షక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందనీ ఆయన కేంద్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.

సంపాదన సృష్టించే కార్మికులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ను వెంటనే విరమించుకొని  44 చట్టాలను యధాతధంగా అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్ అలీ, సిపిఐ జిల్లా కార్యదర్శిd రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి పౌలు, ముస్కే సమ్మయ్య, కలిందర్ అలీ ఖాన్, తోకల సరస్వతి, దాగం మల్లేష్, సలేంద్ర సత్యనారాయణ, బీమనాధుని సుదర్శన్, దేనబోయిన బాపు, జాడి పోషం, శంకర్ లు పాల్గొన్నారు.