calender_icon.png 2 August, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలోని ప్రతి కాలనీ అభివృద్ధే లక్ష్యం

01-08-2025 10:16:43 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ జులైవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), మేయర్ గుండు సుధారాణి(Mayor Gundu Sudharani) ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి కాలనీ అభివృద్ధే మా ధ్యేయం. ప్రజలకు మౌలిక సదుపాయాలు, శుభ్రత, మంచినీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాటులుండకుండా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తయ్యేలా కార్యచరణ రూపొందించామని తెలిపారు.

అనంతరం సుబేదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్సైజ్ శాఖ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు.  పవిత్ర శ్రావణమాసం సందర్భంగా శుక్రవారం శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఇప్పటికే ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం భద్రఖాళీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక రోజులలో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాలని జీఓ విడుదల చేసింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఇవి శ్రీనివాస్ రావు, ఎక్సైజ్ శాఖ అధికారులు,కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు,  డివిజన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.