calender_icon.png 2 August, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

01-08-2025 10:14:29 PM

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మోడల్ స్కూల్(Telangana Model School Marriguda) ప్రిన్సిపాల్ శివ స్వరూపారాణి సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచారి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మర్రిగూడ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ విధులలో నిర్లక్ష్యం వహిస్తూ, ఆ పాఠశాలకు మంజూరైన నిధులలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ కు పూర్తి ఆధారాలతో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు గత రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత సోమవారం డిడి దుర్గాప్రసాద్ విచారణ నిర్వహించి ఉన్నతాధికారులకు విచారణ నివేదికను అందజేశారు. ఈ మేరకు నిధులలో ప్రిన్సిపల్ అవినీతికి పాల్పడిందని రుజువు చేస్తూ శివ సరూపారాణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.