calender_icon.png 2 August, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా రిజర్వేషన్ల దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

01-08-2025 10:18:38 PM

మందమర్రి (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ల కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప మహిళా దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా జిల్లా మహిళా కమిటీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు అంబేడ్కర్ చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు గ్రామీణ మహిళలు తమ  హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో  ముందుకు సాగాలన్నారు.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు మాట్లాడుతూ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల హక్కుల కోసం పనిచేస్తుందన్నారు. జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని విద్య ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానిగా ఎదిగాడన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నెరువట్ల రాజలింగు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు అసంపల్లి శ్రీనివాస్, కొల్లూరి రవి కుమార్, జిల్లా నాయకులు మామిడిపల్లి అంజయ్య, జాడి నరేష్, మద్దెల నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు సకినాల శంకర్, కోటపల్లి మండల అధ్యక్షుడు కుమ్మరి రాజేందర్ లు పాల్గొన్నారు.

జిల్లా మహిళా నూతన కార్యవర్గం ఎన్నిక 

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళ కమిటీ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షురాలుగా సుంకరి లక్ష్మీ, అధ్యక్షురాలుగా బండ శాంకరి ఉపాధ్యక్షురాలుగా ఇడుగురాల పద్మజ, ఉప్పులేటి గోపిక, భాస్కరీ సునీత, సుహాసిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొట్టె స్వర్ణ, సంయుక్త కార్యదర్శులుగా దరిపల్లి స్వరూప, దుర్గం భాగ్యలక్ష్మి, ఆవునూరి కవిత, సమీండ్ల లక్ష్మి, ప్రచార కార్యదర్శులుగా పులిపాక భాగ్యలక్ష్మి, గాజుల స్వర్ణ లత, సల్లూరి భవాని, మాధురి, కోశాధికారిగా రేండ్ల రుక్మిణి, కార్యవర్గ సభ్యురాళ్లుగా కట్ల భాగ్యలక్ష్మి, సురమళ్ళ జ్ఞానలీల, దాసరి శోభారాణి లు ఎన్నికయ్యారు.