మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
ఏటా రూ.20 వేలకోట్ల వడ్డీ లేని రుణాలు
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేం దుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే ఏటా రూ.20 వేలకోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర రుణాలను మహిళలకు ఇవ్వాలని నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని తెలిపారు.
పర్యాటక భవన్‌లో తెలం గాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వ ర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నామ న్నా రు. హైదరాబాద్‌లోనే కాకుండా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో మహిళా సంఘాల ఉత్ప త్తులను విక్రయించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
మహిళా సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయ బోతున్నామని తెలిపారు. మహిళల అభివృ ద్ధి మీదే సమాజాభివృద్ధి ఆధారపడి ఉం టుందని, అన్ని రంగాల్లో వారిని ముందం జలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా మహిళా సంఘాల కు వేల కోట్ల రుణాలు ఇప్పిస్తున్నామని, వారు తీసుకునే బ్యాంకు రుణాలకు ప్రభు త్వమే వడ్డీలు చెల్లిస్తోందన్నారు.




