21 August, 2026 | 4:36 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

తెలుగు సబ్జెక్టు తప్పనిసరి నిబంధన పొడిగింపు

08-12-2024 02:13 AM

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): పాఠశాల విద్యలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి అమలు నిబంధనను పొడిగించారు. ఈ విద్యాసంవత్సరానికి 9, 10వ తరగతిలో తెలుగు తప్పనిసరిగా అమలు చేయడంతోపాటు 2025 విద్యాసంవత్సరానికి పదో తరగతిలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గత ప్రభుత్వం పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఆయా పాఠశాలలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ప్రతీ సారి తెలుగు తప్పనిసరి అమలు నిబంధనను పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తోంది.