01-01-2026 12:00:00 AM
ఆలేరు, డిసెంబర్ 31 (విజయక్రాంతి): స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల మాట్లాడుతు పాఠశాల స్థాయిలోనే ఎన్నికల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం అన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకున్న ఎన్నికల నిర్వహణ ప్రయోగాత్మకంగా చూసినప్పుడు మరింత అవగాహన ఏర్పడుతుందని.
ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థుల నుంచి దరఖాస్తుల, స్వీకరణ, అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించడం, తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం, ప్రచారానికి కొంత సమయం ఇవ్వడం, నిర్ణీత రోజున ఎన్నికలు నిర్వహించడం ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలు ప్రకటించడం ఎన్నికైన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం లాంటి అనే అంశాలు ఈ ప్రక్రియలో మనం తీసుకుంటామన్నారు.
సోషల్ టీచర్ సుజారాణి పర్యవేక్షణలో జరిగిన ఈ మాక్ పోలింగ్ లో పాఠశాల ఉపాధ్యాయులు రావుల సత్యనారాయణ రెడ్డి, హేమలత, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, జే.సైదులు, కే.మల్లేశం, ఆదినారాయణ, జ్యోత్స్న, ఎన్సిసి క్యాడేట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్సిసి ఆఫీసర్ దూడల వెంకటేష్ మరియు క్యాడేట్స్ సహకారం అందించారు. విద్యార్థులు ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.