02-08-2025 12:27:28 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మోతె, ఆగస్టు 1 : తల్లి పాల ద్వారానే శిశువులకి తగిన పోషకాలు అందుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎ ఎన్ సి రిజిస్టర్, ఓ పి రిజిస్టర్ పరిశీలించారు. బ్లడ్ టెస్ట్ వివరాలు, మెడిసీన్స్ అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఎ ఎన్ సి చెకప్ కి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం తీసుకుంటే శిశువు ఎదుగుదల ఉంటుందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రసవాలు పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ వెంకన్న, ఎంపిడిఓ ఆంజనేయులు, మెడికల్ అధికారి యస్వంత్, ఆయుష్ డాక్టర్ వాణి, స్టాఫ్ నర్సులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.