calender_icon.png 3 May, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

03-05-2025 01:26:27 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, మే 2 (విజయ క్రాంతి): సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని  వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈరోజు హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే  నివాస క్యాంపు కార్యాలయం నందు హసన్ పర్తి మండలంలోని  1, 2, 55, 56, 65, 66  డివిజన్ల కు సంబందించిన కళ్యాణ లక్ష్మీ, షాధీ ముబారక్ 37 మంది లబ్దిదారులకు  37లక్షల 3వేల 712 రూపాయల విలువ గల చెక్కలను, 55వ డివిజన్ కు సంబంధించిన 6 మంది లబ్దిదారులకు రూ. 1లక్ష 74వేల 500 రూపాయల విలువ గల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా నూతన వధూ వరులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించబడిందని అన్నారు.  పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఉన్నదని  అన్నారు.

వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన సీఎం సహాయ నిది చెక్కులను సైతం తీసుకు వచ్చి పంపిణి చేయడం జరుగుతుందన్నారు. క్యాంప్ కార్యాలయం కు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హసన్ పర్తి మండల మరియు 1, 2, 55, 56, 65,డివిజన్ల ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్, గ్రామ పార్టీ, 66 డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్ మాజీ మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, ఎర్రగట్టు గుట్ట చైర్మన్ ఆరెల్లు వెంకటస్వామి, మాజీ జెడ్పిటిసి వింజయమూరి వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచి బల్సుకురి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్, 66 డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు కొండమీది సంతోష్, సీనియర్ నాయకులు పెద్దమ్మ నరసింహులు, మేకల ఆనంద్, జన్ను రమేష్, 66వ డివిజన్ యూత్ అధ్యక్షులు తాళ్ల మధు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిగుల్ల సురేష్, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.