03-05-2025 01:27:43 AM
మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాసరెడ్డి
చొప్పదండి, మే 2 (విజయ క్రాంతి): అనారోగ్యంతో, ప్రమాదాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే పేద, మధ్యతరగతి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ.21 లక్షల 16 వేల 500 చెక్కులను పంపిణీ చేశారు.
సీఎంఆర్‌ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, రామిడి రాజిరెడ్డి, గరికంటి కరుణాకర్ ,సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, కోల ప్రభాకర్, దోమకొండ మహేష్, ముద్దం నగేష్, కర్ర బాపురెడ్డి, మంత్రి మహేందర్, వేముల అంజి తదితరులు పాల్గొన్నారు.