calender_icon.png 23 January, 2026 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పీఠం హస్తగతమే లక్ష్యం: తాహెర్

23-01-2026 12:00:00 AM

ఆదిలాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఆశావహుల జాబితా పరిశీలించి మూడు సర్వేలు జరుగుతున్నాయని, ఈనెల 26వ తేదీ వరకు పూర్తి సర్వేల రిపోర్ట్ వస్తుందన్నారు. వాటి ఆధారంగా గెలిచే సత్తా ఉన్నవారికే పార్టీ బీఫాం కేటాయిస్తుందన్నారు. 49 వార్డుల్లో బలమైన గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధులనే బరిలో నిలుపుతామన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు