16 June, 2026 | 8:45 AM

3వేల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటే లక్ష్యం

16-06-2024 12:37 AM

పరిశ్రమలు, వాణిజ్యశాఖ డైరెక్టర్ వీసీ గోపాలకృష్ణన్ 

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి) : తెలంగాణలో ప్రస్తుతం 500పైగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని, మరో ఒకటిన్నర సంవత్సరంలో 3వేలకు పైగ్టాషన్లను నెలకొల్పాలని భావిస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైకెక్టర్, ఆటోమోటివ్, ఈవీ సెక్టార్ డైరెక్టర్ వీసీ గోపాలకృష్ణన్ తెలిపారు. శనివారం ఎఫ్‌టీసీసీఐ ఆధ్వ ర్వ్యంలో మాదాపూర్‌లోని టీహబ్‌లో ఈవీ ఛార్జింగ్ అప్ ఫర్ ఈ మొబిలిటీ కాన్ఫరెన్స్--- నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ గోపాలకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మూడు కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీఆర్ ఈడీసీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ , టీఓ గడ్డం వినీత్, రైడ్ సీఈఓ దేవేందర్ రెడ్డి, కే.జాస్తీ, ఎస్‌ఎన్‌జే సోలార్ సీఈఓ సూర్య, వినోద్ కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు.