calender_icon.png 17 November, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మరి వృత్తిదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

17-11-2025 01:04:49 AM

ఆలేరు, నవంబర్ 16 (విజయ క్రాంతి): -  తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం (టి.ఆర్.కే.ఎస్) ఆలేరు మండల అధ్యక్షుడు  గంగాదారి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరీ పరమేశ్వర్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశాన్ని ఆలేరులో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం బలోపేతం కోసం ప్రతి గ్రామ శాఖ నుంచి సభ్యుల భాగస్వామ్యం పెరగాలని,ప్రభుత్వ పథకాలను ప్రతి కులవృత్తిదారుడికి చేరేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.

వృత్తిదారుల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం జిల్లా నాయకత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. యువత సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని సంఘ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మండల ప్రధాన కార్యదర్శి జివిలికపల్లి సత్యనారాయణ,అసోసియేట్ అధ్యక్షుడు కోరుటూరి బాలరాజు, మీడియా విభాగం కోరుటూరు ఉపేందర్, రాజకీయ విభాగం కోరుటూరు సతీష్, మండల ఉపాధ్యక్షుడు శనిగరం హరీష్, కొరుటూరీ నరసింహులు, గంగాధరి ఇస్తారి, గంగాధరి సాయికిరణ్, గంగాధరి సత్తయ్య, సాయి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధరీ పరమేష్ పాల్గొన్నారు.