16-07-2025 11:42:14 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న టైలర్స్ డే ను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నామే తప్ప కుల వృత్తినే నమ్ముకున్న దర్జీల కుటుంబాలకు ఏ రకంగా కూడా ఏ ప్రభుత్వం ఆదుకోలేదని ఇల్లందు టైలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్ మౌలానా ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో దర్జీలు ఎదుర్కొంటున్న సమస్యలపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు దర్జీ వృత్తి మనుగడ ప్రశ్నార్థకారంగా మారుతుందని కనీసం కొందరికి పని లేక దర్జీలు ఆర్థికంగా, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్జీలకు వచ్చే టైలర్స్ డే రోజున విలియం వోవే భవనాన్ని నిర్మించాలని, హెల్త్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆధునిక మిషన్లను అందజేయాలని విన్నపించారు. ఇదే మాదిరిగా ప్రతి నియోజకవర్గంలో దర్జీలు తమ డిమాండ్లపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు వినతి పత్రం అందజేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవ తీసుకుంటే ఇదే స్పూర్తితో కేంద్ర,ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు దర్జీలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.నేడు ఇల్లందుకు విచ్చేస్తున్న మంత్రి సీతక్కకు వినతిపత్రం ద్వారా తెలియజేస్తామన్నారు.