calender_icon.png 7 July, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలియో నిర్మూలనకు రోటరీ క్లబ్ కృషి

07-07-2025 12:00:00 AM

రోటరీ క్లబ్ గవర్నర్ హరిహర ప్రసాద్ 

కామారెడ్డి అర్బన్, జూలై 6 (విజయ క్రాంతి), అంతర్జాతీయంగా పేరుపొందిన రోటరీ క్లబ్ లో లక్షల మంది సభ్యులు ఉన్నారని,పోలియో వ్యాధి నివారణ లో అతి ముఖ్య పాత్ర పోషించినదని రోటరీ క్లబ్ గవర్నర్ హరిహర ప్రసాద్ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం రోటరీ ఆడిటోరియంలో నిర్వహించిన 51వ రోటరీ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

విద్య, వైద్యం తో పాటు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళుతుందన్నారు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావచ్చు అని తెలిపారు. రోటరీ క్లబ్ ఎంతో కృషి చేసిందని రోటరీ గవర్నర్ హరిహర ప్రసాద్ అన్నారు.  రోటరీలో సభ్యులుగా చేరితే ఎంతో సమాజసేవ చేయవచ్చని అన్నారు.

కామారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షునిగా వై శంకర్, కార్యదర్శిగా సబ్బని కృష్ణ హరి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా జైపాల్ రెడ్డి, పున్న రాజేష్ సీనియర్ ప్రతినిధులు శ్రీశైలం డాక్టర్ బాలరాజు డాక్టర్ విజయ్ కుమార్ దానం జై సుధాకర్ లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి రోటరీకి విశిష్ట స్థానం ఉందని అనేక సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్, ఆర్మూర్ రోటరీ సభ్యులు అమర్, సంతోష్, దత్తాద్రి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రోటరీ క్లబ్ ఇన్స్టలేషన్ డే..

నేడు స్థానిక కామారెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన 51వ ఇన్స్టలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ నామిని హరిహర ప్రసాద్ గారు, గెస్ట్ ఆఫ్ హానర్ గా పిడిజి హనుమంత్ రెడ్డి గారు, స్పెషల్ గెస్ట్ గా అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. 2025 -26 సంవత్సరానికి రోటరీ  క్లబ్ కామారెడ్డి కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది .

కొత్త కమిటీ అధ్యక్షునిగా వై శంకర్ గారు, సెక్రెటరీగా ఎస్. కృష్ణ హరి గారు, ప్రెసిడెంట్ గా వెంకటరమణ గారు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్య అతిథి వీరిచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం క్లబ్ డైరెక్టర్లు డిస్ట్రిక్ట్ బాడీ మరియు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ రోటరీ అనేక సేవ కార్యక్రమాలు ఇంతకు ముందు చేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో డెస్క్ లు,  టాయిలెట్లు, ప్రభుత్వ ఆసుపత్రి లో స్ట్రెచర్ బెడ్స్, పేద మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగుల కు వీల్ చేర్స్,  అమ్మాయిలకు సైకిల్స్ లాంటివి నిర్వహించామనీ మరియు రాబోయే సంవత్సరం మరిన్ని కార్యక్రమాలతో ముందుంటామని, ముఖ్యంగా యువతను రోటరీ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తామని తెలియజేశారు.

హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కామారెడ్డి రోటరీ కి విశిష్ట స్థానం ఉందని అనేక సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నారని, ఇదేవిధంగా ఇక ముందు కూడా చేయాలని తెలియజేశారు. ముఖ్య అతిథి, గవర్నర్ నామినీ హరి హర ప్రసాద్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయంగా పేరొందిన రోటరీలో లక్షల మంది సభ్యులు ఉన్నారని, పోలియో నివారణలో అతి ముఖ్య పాత్ర పోషించిన రోటరీ విద్యా,

వైద్యంతో పాటు సామాజిక సేవ మరియు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తుందని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావచ్చు అని ఏదో రకంగా రోటరీకి చేయూతని అందిస్తే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం కొత్త కమిటీ సభ్యులకు ఘనంగా  సన్మానించారు. ఈ కార్యక్రమంలో  నిజామాబాద్, ఆర్మూరు రోటరీ సభ్యులు, రోటరీ సభ్యులు శ్రీశైలం, సుభాష్ జైన్, సుధాకర్, పున్న రాజేష్, ధనంజయ, డాక్టర్ బాలరాజు, డాక్టర్ విజయకుమార్, అమర్, సంతోష్,  దత్తాత్రి, నవీన్ కామారెడ్డి వాసులు అనేకమంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.