calender_icon.png 1 January, 2026 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారుల అభివృద్ధ్ధే ప్రభుత్వ లక్ష్యం..

01-01-2026 12:22:02 AM

  1. మండలంలోని ప్రతి గ్రామానికి రోడ్ల సమస్యను పరిష్కరిస్తా
  2. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
  3. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మర్రిగూడ, డిసెంబర్ 31 (విజయక్రాంతి): రవాణా సౌకర్యానికి అంతరాయం కలగకుండా రహదారులు,లింకు రోడ్ల అభివృద్దె  ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని  రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  బుధవారం చండూర్ మండలంలో తుమ్మలపల్లి గ్రామంలో ఓ లో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై హైదరాబాదుకు వెళ్తున్న సమయంలో మర్రిగూడ మండలంలోని యరగoడ్లపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించిన అనంతరం మంత్రి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిరుపేదలకు చేరే విధంగా చూస్తూ  కార్యకర్తలు పార్టీ బలోపేతం చేయడం కోసం  ఒక సైనికులుగా పనిచేయాలని సూచించారు.రోడ్ల సమస్యలు ఉన్నట్లయితే రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి రోడ్ల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.గిరిజన గ్రామపంచాయతీ తండాలో కొత్తగా చౌక ధరల దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లయితే వెంటనే రేషన్ దుకాణాన్ని మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, జిల్లా నాయకులు పులిమామిడి నర్సింహా రెడ్డి మాల్ డైరెక్టర్ జమ్ముల వెంకటేశం, వనపర్తి యాదయ్య, ఆకారపు శ్రీను, సిలువేరు యా దయ్య, గాంధీ, వల్లంల శ్రీనివాస్, మామిడి అంజయ్య,నక్కర గోని కొండల్,గ్యార వెంకటేష్,కురంపల్లి నర్సింహా, నక్కరగోని స్వామి,మాడెం శంకర్,మాడెం రవి,పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.