ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
టేకులపల్లి,జూన్ 22, (విజయక్రాంతి): ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. టేకులపల్లి మండలం కొత్త తండా (జి), చంద్రుతండా గ్రామ పంచాయతీలలో సోమవారం ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు అందిస్తామని, విడతల వారీగా ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటూ ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు లబ్ధిదారుల కుటుంబాలకు స్వీట్లు తినిపించి, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గృహప్రవేశాల సందర్బంగా గ్రామమంతా పచ్చని తోరణాలు, అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా చేశారు.
కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల వద్ద మహిళలు హారతులతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి, హోసింగ్ ఏఈ గణేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్కినేని శ్యామ్, మార్కెట్ చైర్మన్ రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, స్థానిక సర్పంచ్ తారాచంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






