మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, జూన్ 22 (విజయక్రాం తి): ఇందిరా మహిళా శక్తి పథకం కింద మా దాపూర్ డివిజన్లోని అయ్యప్ప సొసైటీ ప్రాం గణంలో మహిళా స్వయం సహాయక సం ఘాల సభ్యులకు ‘ఇందిరమ్మ‘ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ,ప్రాజెక్టు ఆఫీసర్ సురేష్ రెడ్డితో కలిసి పాల్గొని 5,950 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్న ఆయన, మహిళల ఆర్థిక స్వావలంబనకు రుణాలు, శిక్షణ, ఉపాధి అవకాశాలు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిక్ బస్సులు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఎల్లమ్మబండలో త్వరలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






