23 June, 2026 | 1:32 AM

పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

23-06-2026 12:00 AM

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రంజిత్ కుమార్

వరంగల్, జూన్ 22 (విజయక్రాంతి): పిఆర్సి  గడువు ముగిసి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం పిఆర్సి ప్రకటించకుండా తాత్సారం చేస్తోందని, వెంటనే పిఆర్సి ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి.ఎస్.యు.టి.ఎఫ్ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికాయల కుమార్ అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టి.ఎస్.యు.టి.ఎఫ్ రాష్ట్ర కా ర్యదర్శి కె.రంజిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఇ.హెచ్.సి.టి) ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వెంటనే విధి విధానాలు రూపొందించి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పి.ఆర్.సి గడువు ముగిసి మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా తాత్సారం చేయడం తగదని, తగిన ఫిట్మెంట్ తో వెంటనే పి.ఆర్.సి  ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెట్ తప్పనిసరి చేయడంతో సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా టెట్ అర్హత మార్కులు తగ్గించాలని కోరారు.

సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను, కరువు భ త్యాలను మంజూరు చేసి ఉపాధ్యాయుల్లో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలన్నారు. ఈ త రుణంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జూన్ 25 న ఎస్ .టి.ఎఫ్.ఐ, టి.ఎస్.యు.టి.ఎఫ్ సంయుక్తంగా తలపెట్టిన నిరసన ప్రదర్శనలను సంఘాలకతీతం గా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి సి.సుజన్ ప్రసాదరావు, ఉపాధ్యక్షులు నామోజు శ్రీనివాస్, కోశాధికారి ఎస్.ఎ.రవూఫ్, కార్యదర్శులు కె.రవీందర్, కె.రమేష్, ఆడిట్ కమిటీ కన్వీనర్ గుండు కరుణాకర్ పాల్గొన్నారు.