2 May, 2026 | 1:53 AM

పేదవాడి కండ్లలో ఆనందం చూడడమే సర్కార్ లక్ష్యం

02-05-2026 12:00 AM

చేగుంట, మే 1: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం, చేగుంట మండలం బి. కొండాపూర్ గ్రామంలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారు మంగళి శివయ్య, బాలమణితో కలిసి నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా పాలనలో ప్రతి పేదవాడి కండ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా పని చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందే వరకు మా కృషి కొనసాగుతుంది.

ప్రజా పాలనలో పేదల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,ఉపాధ్యక్షుడు మాసాపేట శ్రీనివాస్, బోనాల సర్పంచ్ సుకన్య నాగులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, గ్రామ అధ్యక్షుడు బేగారి రమేష్,, తోట రమేష్ గుప్తా, గొర్మిల శ్రీనివాస్ బ్యాగారి రామస్వామి, అల్లి శ్రీనివాస్ రెడ్డి, బేగరి ప్రశాంత్ కత్తుల నరసింహులు పాలేటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.