calender_icon.png 22 May, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం

22-05-2025 12:00:00 AM

సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి

చేవెళ్ల , మే 21 : రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులో సీపీఐ గ్రామ శాఖ మహాసభ కార్యక్రమం గ్రామ కా ర్యదర్శి ఎం.వినోద అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రె స్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటినా ఏఒక్క హామీని సక్రమంగా మలు చేసిన దాఖలాలు లేవన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రూ.2500, పంట పెట్టుబడి సాయం, పేదిం టి ఆడ బిడ్డల పెండ్లిళ్లకు రూ.1లక్ష తులం బంగారం ఇలాంటి ఇంకా మరెన్నో పథకాలను ప్రజలకు అందించకుండా మోసం చే స్తూ పాలన సాగిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, గ్రామస్తులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 

నూతన కమిటీ..

దేవునిఎర్రవల్లి సీపీఐ గ్రామ శాఖ నూ తన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కార్యదర్శిగా ఎం.వినోద, సహాయ కార్యదర్శిగా రుక్కమ్మ, కమిటీ సభ్యులుగా పెంటమ్మ, కృష్ణవేణి, రాములమ్మ, నరేశ్, మహేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు.