calender_icon.png 22 May, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యానవన పంటల సాగును పెంచాలి

22-05-2025 12:00:00 AM

నకిలీ రైతు విత్తనాల జిల్లాగా మార్చాలి కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, మే 21 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటల సాగును పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగు వా న్ బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారుతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, డిఆర్డిఓ ఏపీఓలతో సమీక్ష నిర్వ హించారు. సమీక్ష ప్రారంభిస్తూ వ్యవసాయ శాఖ చేస్తున్న పథకాలపై ఆరా తీశారు.

జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025 కు సంబంధించి వివరాలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు జరుగుతుందని తెలిపారు. వరి 3,18,000 ఎకరాల్లో, సోయా 84,000 ఎకరాల్లో పత్తి 34,000 ఎకరాల్లో  కంది 21 వేలఎకరాల్లో మక్కా 50 వేల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేసిన ట్లు తెలిపారు.

విత్తనాలు అలాగే ఎరువులు పురుగుమందులు లభ్యత , అవసరం అనే విషయాలపై కలెక్టర్ కు జిల్లా వ్యవసాధికారి విన్నవించారు. కలెక్టర్ మాట్లాడుతూ    విత్తనాలు, ఎరువులు రైతులకు సరిపడ అందు బాటులో ఉంచాలని తెలిపారు.  నకిలీ విత్తనాలు జిల్లాలో ఉండకుండా చూడాలని పోలీస్ శాఖ, వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్స్ ప్రతిరోజు తనిఖీలు చేసి ఈ సీజన్లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.

పత్తి ఎక్కువగా సాగు చేసే బిచ్కుంద, ఎల్లారెడ్డి, కామా రెడ్డి డివిజన్లో ఎక్కువ తనిఖీలు చేపట్టి సం బంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రైతులకు  నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లాను నకిలీ విత్తన రహిత జిల్లాగా ఉంచాలని అధికారులకు సూచించారు. రైతు బీమా గురించి  రివ్యూ చేస్తూ రైతు బీమా పర్ పెర్ఫార్మెన్స్ ఉన్న మండలాలు పెద్ద కొదప్గల్  డెత్ రికార్డింగ్ చేయదానికిని ఎక్కువ రోజులు ,డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయదానికి ఎక్కువ రోజు లు అవడం వల్ల  సంబంధిత డీటెయిల్స్ అడిగి పెర్ఫార్మన్స్ సరిగా లేకపోతే చర్యలు తీసుకోవాలని నిర్దేశించడం జరిగింది.

అలాగే మొన్న మార్చి నుంచి ఇప్పటివరకు జరిగిన అధికవర్షాలు  వడగళ్ల వానల వలన పంట నష్టం వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో 193 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలియజేయగా అవి వాటి వివరాలు  వచ్చిన వెంటనే చర్యలు చేపట్టాలని నిర్దేశించడం జరిగింది వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ సమీక్ష ముగిసిన వెంటనే హార్టికల్చర్ కి సంబంధించి సమీక్ష లో సంవత్సరానికి  ఆయిల్ ఫామ్ ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలని టార్గెట్‌ని మండలాల వారీగా విభజించి వ్యవసాయాధికారి, హార్టికల్చర్ అధికారి అలాగే హిందూస్థాని లివర్ కంపెనీ అధికారి ముగ్గురు సమన్వయంతో ఆ టార్గెట్ ను పూర్తి చేయాలని తెలిపారు.

ఆయిల్ పామ్  మొక్కలు 3000 ఎకరాల్లో  నాటే విధంగా చర్యలు తీసుకోవాలని దాని పై  నివేదికలు సమర్పించాలని ఆర్టికల్చర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇవన్నీ కూడా ఏపీఓ, అగ్రికల్చర్ ఆఫీసర్,ఆర్టికల్చర్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఫామ్ పాండ్స్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ గురించి అగ్రికల్చర్ ఆఫీసర్స్, సమన్వయంతో రైతుల ఐడెంటిఫికేషన్ చేసి  పని ప్రారంభించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, డిఆర్డిఓ సురేందర్, హార్టికల్చర్ అధికారి, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులు, మండల హార్టికల్చర్ అధికారులు,  ఏపీవోలు, హిందుస్థాన్ లివర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

  1. ఇసుక తరలకుండా చెక్ పోస్టుల ఏర్పాటు
  2. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ 

కామారెడ్డి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంపై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరు ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.

ఈ సమా వేశంలో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలోని హస్గుల్, కుర్లా గ్రామాలకు స్టానిక అవసరాలకు సంబంధించి ఇసుక లభ్యత, దాని పర్యావరణ అనుమతులు, మట్టికీ సంబంధించి కనీస పరిమాణంలో స్థానిక అవసరాలకు తహసిల్దారులకు అనుమతి ఇచ్చి సులబమైన పద్దతి, ఇసుక రవాణా నియంత్రించడంలో చెక్‌పోస్టులు పెట్టేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి సమావేశంలో జిల్లా కమిటీ సమావేశం చర్చించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. విక్టర్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి,  నాగేశ్, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖా (ఇంచార్జ్),  సతీశ్ యాదవ్, జిల్లా భూజల శాఖా,  సాలుమాను, ఇఇ. ఇరిగేషన్ శాఖా, శ్రీనివాస్, అదికారులు పాల్గొన్నారు.