రచయిత రమేశ్‌కు యువ పురస్కారం
16-06-2024 01:17 AM
- ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ
అభినందలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): బంజారా జీవనశైలి మీద రచనలు చేసిన నునావత్ రమేశ్ కార్తీక్ నాయక్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. 2024కు గాను యువ పురస్కారానికి రమేశ్ ఎంపికైనట్లు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. రమేశ్ రాసిన ధావ్లో చిన్న కథల సంకలనానికి ఈ అవార్డు వచ్చినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా రమేశ్‌ను మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. రమేశ్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి తండాకు చెందినవారు.






